NTV Telugu Site icon

హైద‌రాబాద్‌లో స్వ‌చ్చ‌మైన గాలి ఈ ప్రాంతాల్లోనే ల‌భిస్తుంది…

గ‌త కొంత‌కాలంగా వాతావ‌ర‌ణంలో కాలుష్యం విప‌రీతంగా పెరిగిపోతున్న‌ది.  ఉద్గార వాయువులు వాతావ‌ర‌ణంలో క‌లిసిపోవ‌డంతో కాలుష్యం ఏర్ప‌డుతున్న‌ది.  గాలిలో ఆక్సీజ‌న్ శాతం త‌గ్గిపోయి శ్వాస‌సంబంధ‌మైన ఇబ్బందులు ఏర్ప‌డుతున్నాయి.  కాలుష్యాన్ని త‌గ్గించాలి అంటే త‌ప్ప‌నిస‌రిగా చెట్ల‌ను పెంచాల‌ని నిపుణులు పేర్కొన్నారు.  కాగా, హైద‌రాబాద్‌లో స్వ‌చ్ఛ‌మైన గాలి ఎక్క‌డ లభిస్తుంది అనే అంశంపై తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ను విడుదుల చేసింది.  ఈ ఇండెక్స్ నివేదిక ప్ర‌కారం హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌, ఉప్ప‌ల్‌లో స్వ‌చ్ఛ‌మైన గాలి ల‌భిస్తుంద‌ని పేర్కొన్న‌ది.  జూబ్లీహిల్స్‌, ఉప్ప‌ల్‌లో 30 నుంచి 50 వ‌ర‌కు గాలి నాణ్య‌త న‌మోదైన‌ట్టు కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి పేర్కొన్న‌ది.  ఇండెక్స్ లెక్క‌ల ప్ర‌కారం 0-50 వ‌ర‌కు  న‌మోదైతే గుడ్ ఎయిర్‌గా, 50 -100 వ‌ర‌కు న‌మోదైతే సంతృప్తిక‌రంగా, 101-200 మ‌ధ్య న‌మోదైతే ఓ మాదిరిగాను, 201-300 మ‌ధ్య న‌మోదైతే పూర్‌గాను, 301-400 మ‌ధ్య న‌మోదైతే వేరీపూర్‌గాను, 400ల‌కు మించి న‌మోదైతే తీవ్రమ‌ని పేర్కొంటారు.  అయితే, బాలాన‌గ‌ర్‌, ప్యార‌డైస్‌, చార్మినార్ ప్రాంతాల్లో గాలి సంతృప్తిక‌రంగా ఉన్న‌ట్టు నివేదిక‌లు చెబుతుండ‌గా, జీడిమెట్ల‌లో ఎలాంటి మార్పులు లేవ‌ని నివేదిక చెబుతున్న‌ది.  

Read: ఆ ఎమ్మెల్యేకు యువకుడు లేఖ‌: త‌నకో గర్ల్‌ఫ్రెండ్ కావాలని వినతి…