ప్రధాని మోడి అమెరికా పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ప్రధాని మోడి అమెరికాలోని టాప్ కంపెనీలైన క్వాల్‌కామ్, అడోబ్, ఫస్ట్ సోలార్, జనరల్ అటమిక్స్, బ్లాక్‌స్టోన్ సీఈవోలతో ప్రధాని చర్చలు జరిపారు. అనంతరం వాషింగ్టన్‌లోని వైట్ హౌస్‌లో ప్రధాని మోడి, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌తో భేటీ అయ్యారు. ఈ బైటీలో రెండు దేశాల మధ్య సంబంధాలు, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో సహకరించినందుకు అమెరికాకు ప్రధాని మోడి కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ మూలాలున్న మహిళ అమెరికాకు ఉపాధ్యక్షురాలు కావడం గర్వకారణం అని అన్నారు. కమలాహారిస్‌ను భారత్‌కు రావాలని ప్రధాని ఆహ్వానించారు. బైడెన్, హారిస్ నేతృత్వంలో ఇరుదేశాల మధ్య దైపాక్షిక సంబంధాలు ఉన్నతస్థాయికి చేరుకుంటాయని ప్రధాని మోడి ఆశాభావం వ్యక్తం చేశారు. కమలా హారిస్‌తో భేటీ అనంతరం ప్రధాని మోడి అస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిదే సుగాతో చర్చలు జరిపారు.
Read: ఐపీఎల్ 2021: ఓపెనర్లు రాణించినా… ముంబైకు తప్పని ఓటమి…
