Site icon NTV Telugu

ఫ్యాక్ట్ చెక్: డిసెంబర్ 31 వరకు భారత్ బంద్

ప్రస్తుతం ఏ విషయం అయినా సోషల్ మీడియా ద్వారా క్షణాల్లో పాకిపోతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా డిసెంబర్ 31 వరకు భారత్ బంద్ అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వారం రోజులు లాక్‌డౌన్ విధించిందనే వార్తలు తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి.

Read Also: రాష్ట్రాల‌కు కేంద్రం కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు

అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని కేంద్రప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్‌చెక్ టీం ఖండించింది. కేంద్రప్రభుత్వం అలాంటి ప్రకటనేం చేయలేదని, సోషల్ మీడియాలో వస్తున్న ఆ ప్రచారాన్ని నమ్మవద్దని దేశ ప్రజలకు తెలిపింది. అలాంటి ఫొటోలు, మెసేజ్‌లు షేర్ చేయవద్దని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

Exit mobile version