పాక్ మంత్రి ఫవాద్ నిత్యం ఏదోఒక వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో ట్రోల్ అవుతుంటారు. గతంలో పాకిస్తాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా పనిచేసిన సమయంలో లాహోర్‌లో వాయుకాలుష్యానికి భారత్ కారణం అంటూ మండిపడ్డారు. ఢిల్లీ నుంచి పంజాబ్ వరకు పంటలను తగలబడటం వలన వాయుకాలుష్యం కలుగుతుందని, దీని కారణంగా లాహోర్‌లో కాలుష్యం పెరుగుతుందని అన్నారు. దీంతో అప్పట్లో నెటిజన్లు ఆయనపై ట్రోల్స్ చేశారు. కాగా ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు కొన్ని చేసి మరోసారి ట్రోల్ అయ్యాడు. పాక్‌లో న్యూజిలాండ్ జట్టు తన పర్యటనను రద్దు చేసుకొని వెళ్లిపోవడానికి ఇండియానే కారణం అని, ఇండియాకు చెందిన ఓం ప్రకాశ్ మిశ్ర అనే వ్యక్తి పాక్‌లోని తెహ్రిక్ ఈ తాలిబన్ పేరిట తప్పుడు అకౌంట్ క్రియేట్ చేపి న్యూజిలాండ్ ఆటడాడు గుప్తిల్ భార్యకు మెయిల్స్ పంపించారని, దీంతో భయపడిన న్యూజిలాండ్ జట్టు పర్యటనను రద్దు చేసుకొని వెనక్కి వెళ్లిందని అన్నారు. ఓం ప్రకాశ్ మిశ్రా ఓ ర్యాపర్. 2017లో బొలోనా ఆంటీ పేరుతో చేసిన ర్యాప్ అప్పట్టో సంచలనంగా మారింది. కాగా, ఇప్పుడు పాక్ మంత్రి మరోసారి ఓం ప్రకాశ్ మిశ్రా పేరును తెరమీదకు తీసుకురావడంతో మిశ్రా పేరు మళ్లీ వెలుగులోకి వచ్చింది.
పాక్ మంత్రి ఫవాద్ చౌదరీపై మళ్లీ ట్రోలింగ్… ఇదే కారణం…
