సొంత ఇల్లు ఉండాలని, సొంత ఇంట్లో నివశించాలని చాలా మందికి ఉంటుంది. కాని ప్రస్తుత పరిస్థితుల్లో సొంత ఇల్లు నిర్మించుకోవడం అంటే మామూలు విషయం కాదు. నగరాలు, పట్టణాల్లోనే కాదు, గ్రామాల్లో ఇల్లు కొనుగోలు చేయాలన్నా లక్షల రూపాయలు ఖర్చుచేయాలి. ఇక, ప్రకృతి మధ్య, అందమైన బీచ్‌లు ఉన్న ప్రాంతంలో ఇల్లు కొనాలి అంటే కోట్ల రూపాయలు పెట్టాలి. కానీ, ఆ ప్రాంతంలో ఇల్లు కొనాలి అంటే కేవలం రూ.12 ఉంటే సరిపోతుంది. ఇల్లు మీ సొంతం అవుతుంది. ఇంటిని అందంగా మార్చుకోవడానికి అక్కడి ప్రభుత్వమే అదనంగా మీకు డబ్బు ఇస్తుంది. అంత ప్రచారం చేసినప్పటికీ ఇప్పటి వరకు కేవలం 17 ఇళ్లను మాత్రమే అమ్మగలిగిందట. అదేంటి అని ఆశ్చర్యపోకండి. తక్కువ ధరకు ఇల్లు అమ్ముతున్నారు అంటే దానికి తగ్గట్టుగా షరతులు ఉండే ఉంటాయి మరి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Read: వైరల్: ఇండియాలో ఇది అత్యంత అరుదైన ఇల్లు…
క్రొయోషియాలోని లెగ్రాడ్ అనే ప్రాంతం ఉన్నది. అందమైన ప్రకృతి… ఈ లెగ్రాడ్‌ను ఆనుకొని సుందరమైన సముద్రం, తివాచీలాంటి బీచ్‌లు ఉంటాయి. అక్కడ నివశించడం కంటే కావాల్సింది ఏముంటుంది చెప్పండి. అయితే, అక్కడ నివశిస్తున్న ప్రజలు వేలాది మంది ఇళ్లు ఖాళీ చేసి వలస వెళ్లిపోతున్నారట. దీంతో ఆ లెగ్రాడ్‌లో వందలాది సంఖ్యలో ఇళ్లు ఖాళీగా మారిపోయాయి. అక్కడి అధికారులు ప్రజలను తిరిగి ఆ ప్రాంతానికి రప్పించే ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. అక్కడి ఇళ్లను అమ్మేయాలని అనుకున్నారు. ఇల్లు కొనాలి అనుకుంటే ఒక్క కొనా అంటే రూ.12 చెల్లిస్తే సరిపోతుంది. మీ ఇంటిని అందంగా ముస్తాబు చేసుకోవడానికి 25 వేల కొనాలు ప్రభుత్వం ఇస్తుంది. అయితే, మీరు అక్కడే 15 ఏళ్లపాటు నివశించాలి. ఇది షరతు. ఈ షరతు ఒప్పుకొని కేవలం 17 మంది మాత్రమే ఇళ్లను కొనుగోలు చేశారట.