కొన్ని సార్లు జరిగే విషయాలను ఎలా నమ్మాలో అర్థం కాదు. కళ్ల ముందు జరుగుతున్నా… అది నిజమా కాదా… నిజమైతే ఎలా నిజమైంది అనే బోలెడు సందేహాలు వస్తుంటాయి. ఎక్కడైనా ఒక రైలు ఒకే వేగంతో వెళ్తుంది. కుడివైపున ఒకవేగంతో, ఎడమ వైపున మరోక వేగంతో వెళ్లదు. అది సాధ్యం కాదు కూడా. కానీ, ఈ వీడియో చూస్తే మాత్రం అదేలా సాద్యం అయింది అని నోరెళ్ల బెట్టక తప్పదు. వీడియో చూసిన వారు సైతం అది ఎలా సాద్యం అయిందో తెలియక పదే పదే చూస్తున్నారు. బుర్రకు పదునుపెడుతూ రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఒకవైపు కిటికీకి దగ్గరగా గోడ ఉందని, మరోవైపు గోడ లేకపోవడం వలన ట్రైన్ నిదానంగా వెళ్తున్నా, గోడ వైపు వేగంగా కదులుతున్నట్టు కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది ఎడమ వైపున మరో ట్రైన్ వేగంగా వెళ్తుందని అందుకే ఆ వైపు వేగంగా మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుందని అంటున్నారు. కన్‌ప్యూజింగ్ చేసిన ఈ చిన్న వీడియో ఇప్పుడు యమా ట్రెండ్ అవుతున్నది.
ఒకే రైలు… రెండు వేగాలు… ఎలా సాధ్యం…
