ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. యూరప్, అమెరికా దేశాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరలా ఆంక్షలు మొదలవుతుండటంతో దాని ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడింది. ఒమిక్రాన్ ముందు వరకు దూసుకుపోయిన సూచీలు మళ్లీ పతనం కావడం మొదలుపెట్టాయి. ప్రపంచంతో పాటు ఇండియాలోనూ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. సోమవారం రోజున సెన్సెక్స్ 1190 పాయింట్లు, నిఫ్టీ 371 పాయింట్లు నష్టపోయింది.
Read: వైఎస్ జగన్: వ్యాపారవేత్త నుంచి ముఖ్యమంత్రిగా…
మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.6.80 లక్షల కోట్ల మేర సంపద ఆవిరైంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం, మరణాలు చోటు చేసుకోవడం, మదుపర్లు అమ్మకాలను కొనసాగించడం, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడం, చిన్న మదుపర్ల నుంచి పెట్టుబడులు రాకపోవడం, ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో కొనసాగడం వంటి కారణాలతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి.
