ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కొత్త సంవత్సరం వేడుకలు మొదట న్యూజిలాండ్‌లో ప్రారంభం అయ్యాయి. న్యూజిలాండ్ రాజధాని అక్లాండ్‌లో కొత్త సంవత్సరానికి ప్రజలు స్వాగతం పలికారు. కరోనా నిబంధనలు పాటిస్తూ సంబరాలు చేసుకున్నారు. ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ స్వాగతం పలికారు. కొత్త సంవత్సరంలో కోవిడ్ మహమ్మారిని తరిమికొట్టాలని, మళ్లీ పూర్వం రోజులు రావాలని, ప్రపంచంలోని ప్రజలంతా సుఖసంతోషాలతో గడపాలని ప్రజలు కోరుకుంటూ సంబరాలు చేసుకున్నారు.
Read: విమానంలో ప్రయాణం చేస్తున్న మహిళకు కరోనా… ఐదు గంటలు బాత్‌రూమ్‌లోనే…
కరోనా మొదటి వేవ్‌ను న్యూజిలాండ్ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొన్నది. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు ప్రారంభం కావడంతో న్యూజిలాండ్ ప్రభుత్వం అప్రమత్తమైన సంగతి తెలిసిందే. కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించినా, కరోనా నిబంధనలు పాటిస్తూనే జరుపుకోవాలని ఆదేశించింది.
