NTV Telugu Site icon

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో మరో ట్విస్ట్

సంచలనం సృష్టిస్తున్నా టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో మరో ట్విస్ట్ వచ్చి చేరింది.. ఈ కేసులో ఇప్పటికే రంగంలోకి దిగిన ఈడీ.. డ్రగ్స్‌ సరఫరా చేసే కెల్విన్‌ ఇచ్చిన సమాచారం మేరకు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు.. ఒక్కొక్కరిని ప్రశ్నిస్తూ.. వారి బ్యాంకు లావాదేవీలపై ఆరా తీస్తూ వస్తున్నారు. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ వచ్చింది.. డ్రగ్స్ కేసుకు మూలంగా ఎఫ్ కేఫ్ లాంజ్ మారింది.. ఎఫ్ కేఫ్ లాంజ్ కేంద్రంగా సినీస్టార్స్ కు డ్రగ్స్ సరఫరా అయినట్టు భావిస్తున్నారు.. ఎఫ్ కేఫ్ లాంజ్ ను సెంటర్‌గా చేసుకున్న కెల్విన్.. సినీ తారలకు అక్కడే డ్రగ్స్‌ సప్లై చేసినట్టుగా తెలుస్తోంది.

ఇక, ఎఫ్‌ కేఫ్ లాంజ్‌లో డ్రగ్స్ పార్టీలపై 2017లో దృష్టి సారించింది ఎక్సైజ్ శాఖ.. ఎఫ్ కేఫ్ లాంజ్ పార్టీల ఆధారంగా 2017లో తెర మీదకు టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ వచ్చింది.. అదే ఎఫ్ కేఫ్ లాంజ్ వేదికగా జరిగిన డ్రగ్స్ పార్టీ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది.. డ్రగ్స్ పార్టీలో మత్తు కోసం జరిగిన లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది.. ఇప్పటికే ఎఫ్ కేఫ్ లాంజ్ మేనేజర్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది.. సెప్టెంబర్ 13న ఈడీ ఎదుట హాజరు కావాలంటూ ఎఫ్ కేఫ్ లాంజ్ జనరల్ మేనేజర్‌కు ఆదేశాలు జారీ చేసింది.. అయితే, 2017లో డ్రగ్స్ కేస్ తెర మీదకు వచ్చిన తర్వాత ఎఫ్ కేఫ్ లాంజ్‌ను మూసివేసింది యాజమాన్యం.. అది సినీ నటుడు నవదీప్‌కు సంబంధించిందిగా ప్రచారం జరుగుతూ వస్తోంది. ఇదే ఎఫ్ కేఫ్ లాంజ్ నుండి కెల్విన్‌ అండ్ కో డ్రగ్స్ డీలింగ్స్ చేసినట్టుగా గుర్తించారు.. ఇదే ఎఫ్ కేఫ్ లాంజ్ వేదికగా రకుల్, రానా, రవితేజ తదితరలు పార్టీలకు కూడా హాజరైనట్టు చెబుతున్నారు.