Site icon NTV Telugu

స‌రికొత్త ఆలోచ‌న‌: వ‌ర‌ద‌ల్లో కారు కొట్టుకుపోకుండా ఉండేందుకు…

ఇటీవల కాలంలో తుఫానుల కార‌ణంగా భారీ వ‌ర్షాలు కురిశాయి. ఈ వ‌ర్షాల కార‌ణంగా వ‌చ్చిన వ‌ద‌ల‌తో రోడ్లు సెల‌యేర్ల‌ను త‌ల‌పించాయి.  వ‌రద‌ల్లో బైకులు, కార్లు కొట్టుకుపోయిన సంగ‌తి తెలిసిందే.  సిరిసిల్ల‌లో సైతం వర‌ద‌లు ముంచెత్త‌న సంగ‌తి తెలిసిందే.  వ‌ర్షాల కార‌ణంగా వ‌చ్చిన వ‌ర‌ద‌ల్లో కారు కొట్టుకుపోకుండా ఉండేందుకు ఓ వ్య‌క్తి వినూత్నంగా ఆలోచించాడు.  రోడ్డుపైనున్న కారుకు తాళ్ల‌ను క‌ట్టి ఆ తాళ్ల‌ను ఇంటిపైనున్న పిల్ల‌ర్ల‌కు క‌ట్టాడు.  భారీ వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆ కారు కొట్టుకుపోలేదు.  ఈ దృశ్యాల‌ను కొంద‌రూ వీడియోగా తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్కెర్లు కొడుతున్న‌ది.  

Read: ఒక్క‌ టమోటా చెట్టుకు 839 కాయ‌లు…కిటుకు తెలిస్తే ధ‌ర‌లు…

Exit mobile version