స్టార్ మా టాప్ రియాలిటి షో బిగ్ బాస్ ఇప్పుడు 7 వ సీజన్ ను జరుపుకుంటుంది.. అయిదు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు అయిదుగురు లేడీ కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేయడం గమనార్హం.. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా లేడీస్ వెళ్లిపోవడం పై జనాల్లో గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి..
ఎలిమినేషన్ తర్వాత ఐదోవారంలో మళ్ళీ ఇంకో అయిదుగురిని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో లోపలికి పంపించాడు నాగార్జున. నిన్నటి ఆదివారం ఎపిసోడ్ లో సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ భోలే శవాలి, యూట్యూబర్, నటి నయని పావని, సోషల్ మీడియా పర్సన్, ఇప్పుడిప్పుడే నటిగా ఎంట్రీ ఇస్తున్న అశ్విని శ్రీ, సీరియల్ నటుడు అర్జున్ అంబటి, సీరియల్ నటి పూజా మూర్తిలను నాగార్జున వేదికపైకి పిలిచి బిగ్‌బాస్ హౌస్ లోకి పంపించాడు.. ఇందులో సీరియల్ యాక్టర్స్ గురించి అందరికీ తెలుసు.. కానీ ఇప్పుడు అందరి చూపు నయని పావని పై పడింది..
ఈ అమ్మడు బ్యాగ్రౌండ్ కోసం కుర్రాళ్లు గూగుల్ ను తెగ జల్లెడ పట్టేస్తున్నారు.. ఆమె నిజానికి ఒక యూట్యూబర్.. మొదట టిక్ టాక్ వీడియోలతో పేరు తెచ్చుకొని ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ తెచ్చుకుంది. అలాగే పలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు, కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. పలు టీవీ షోలలో కూడా పాల్గొంది. శ్వేతా నాయుడుతో కలిసి డ్యాన్సులు వేస్తూ, కవర్ సాంగ్స్, ఆల్బమ్స్ చేస్తూ బాగా పాపులారిటీ తెచ్చుకుంది. ఈ అమ్మాయి అసలు పేరు సాయి పవన్ రాజు. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్, క్యూట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని ఇంకా పెంచుకుంటుంది.. అలా క్రేజ్ ను అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది.. ఎన్ని రోజులు ఇక్క తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటుందో చూడాలి..