సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో.. కీలకంగా భావిస్తున్న సినీ నటుడు నవదీప్‌ను ప్రశ్నించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్… ఇవాళ 9 గంటలకు పైగా నవదీప్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు ఈడీ అధికారులు.. నవదీప్‌తో పాటు ఎఫ్ కేఫ్ లాంజ్ జీఎం అర్పిత్ సింగ్‌ను కూడా సుదీర్ఘంగా విచారించారు.. నవదీప్‌తో పాటు క్లబ్‌కు సంబంధించిన అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీశారు.. ఎఫ్ కేఫ్ జీఎం అర్పిత్ సింగ్ కు సంబంధించిన బ్యాంక్ లావాదేవీలపై పరిశీలించిన ఈడీ.. నవదీప్, అర్పిత్ సింగ్ మధ్య జరిగిన బ్యాంక్ లావాదేవీలు, కెల్విన్ తో జరిపిన లావాదేవీలపై కూపీ లాగినట్టు తెలుస్తోంది.. ఎఫ్ కేఫ్ వేదికగా డ్రగ్స్ డీలింగ్స్ నడిచిన నేపథ్యంలో నవదీప్‌ను సుదీర్ఘంగా విచారించారు.
అయితే, ఈడీ అధికారులు వేసిన చాలా ప్రశ్నలకు నవదీప్ సమాధానాలు దాటవేసినట్టు తెలుస్తోంది.. ఎఫ్ క్లబ్ లో జరిగిన అనుమానాస్పద లావాదేవీలపై నవదీప్ నోరు మెదపలేదని తెలస్తోంది.. మేనేజర్ చెప్పే విషయాలకు నవదీప్ చెప్పే విషయాలకు పొంతన లేకపోవడంతో ఇద్దరిని కలిపి విచారించింది ఈడీ.. ఐదు గంటల పాటు ఇద్దరిని కలిపి ఒకే గదిలో విచారించారు ఈడీ అధికారులు.. ఎఫ్ క్లబ్ ద్వార విదేశీయులకు వెళ్లిన లావాదేవీలపైనే ప్రధానంగా అరా తీసినట్టు తెలుస్తోంది.. అయితే, తన పబ్‌కు విదేశీ కస్టమర్లు రావడం వల్ల జరిగిన లావాదేవీలుగా నవదీప్ చెప్పుకొచ్చినట్టుగా సమాచారం. మరోవైపు.. తనకు ఏమి తెలియదని నవదీప్ చెప్పిన ప్రకారం ఆయన చెప్పిన వ్యక్తులకు డబ్బులు పంపించనని… ఎవరికి ఎందుకో పంపనో సమాచారం తెలియని ఎఫ్ కేఫ్ లాంజ్ జీఎం అర్పిత్ సింగ్ సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
