సీనియర్ ఎన్టీఆరే కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు.. ఇలా అంతా ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లో కలిశారు.. ఆప్యాయంగా పలకరింపులు, సరదా ముచ్చట్లు.. జోకులు, చిరుమందహాసాలు.. ఇలా అంతా ఒకే చోట సరదాగా గడిపారు.. చాలా ఏళ్ల తర్వాత అందరినీ ఒకే చోటకు చేర్చిన ఘనత మాత్రం ఎన్టీఆర్ మనవరాలికే దక్కిందని చెప్పాలి.. ఎందుకంటే.. స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి మనవరాలు (చిన్న కుమార్తె, కూతురు) వివాహ వేడుక ఘనంగా ప్రారంభమైంది.. పెళ్లి కుమార్తెను చేసిన సందర్భంగా.. నందమూరి, నారా, దగ్దుబాటి ఫ్యామిలీలు సందడి చేశాయి.. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓ హోటల్ ఈ వేడుక జరిగింది. నందమూరి అల్లుళ్లు నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకున్నారు. వివాహ వేడుకలో చంద్రబాబు, దగ్గుబాటి దంపతులు కలిసి ఫొటోలు దిగారు. పకపక్కనే నవ్వుతూ కనిపించారు… బావలతో పాటు నందమూరి బాలకృష్ణ సరదాగా గడిపారు.
ఇక, అంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం చూడముచ్చటగా ఉందని సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.. పెళ్లి కుమార్తెతో చంద్రబాబు, భువనేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి.. ఇక, ఎన్టీఆర్ చిన్నకూతురు, అల్లుడు.. పక్కపక్కనే నిల్చుని ఫొటోలకు పోజులిచ్చారు. మరోఫోటోలు అన్నగారు కుటుంబం మొత్తం అంటే.. కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు అంతా కలిసి ఫొటో దిగారు.. ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.. కాగా, చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు మధ్య రాజకీయ విభేదాలతో చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు.. గతంలో ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా.. తొలిసారి చంద్రబాబు సీఎం అయిన తర్వాత పరిస్థితి మారిపోయింది.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీ గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన భార్య పురందేశ్వరి కాంగ్రెస్‌లో కీలకంగా పనిచేశారు.. కేంద్రమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.. ఇక, ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలలో పురందేశ్వరి భారతీయ జనతా పార్టీలో చేరారు.. ఇప్పుటికీ బీజేపీలోనే కొనసాగుతున్నారు. అయితే, గతంలో ఇలా ఫ్యామిలీ పార్టీలో అంతా కలిసినా.. ఇంత కలివిడిగా ఉండడం.. కలిసి ఫొటోలు కూడా దిగడం ఇదే తొలిసారి అంటున్నారు. మొత్తంగా రాజకీయంగా ఉత్తర, దక్షిణ దృవాలాంటి వారు ఇప్పుడు ఒకే చోట కలసి సంతోషంగా, సరదాగా గడపడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
