NTV Telugu Site icon

ఆ ఖ‌డ్గం ఖ‌రీదు రూ. 21 కోట్లు…

ప్ర‌పంచంలో చాలా రాజ్యాలు, రాజులు ఉన్నారు.  వారిలో కొంద‌రు మాత్ర‌మే చ‌రిత్ర‌ను సృష్టించారు.  అలాంటి వారిలో ఫ్రాన్స్ కు చెందిన నెపోలియ‌న్ చ‌క్ర‌వ‌ర్తి ఒక‌రు.  నెపోలియ‌న్ 1799లో తిరుగుబాటు జ‌రిగిన‌పుడు వినియోగించిన ఖడ్గాన్ని వేలం వేశారు.  చారిత్రాత్మ‌క ఖ‌డ్గం 2.8 మిలియ‌న్ డాల‌ర్ల‌కు అమ్ముడుపోయింద‌ని వేలం నిర్వాహ‌కులు ప్ర‌క‌టించారు.  ఇల్లినాయిస్‌కు చెందిన రాక్ ఐలాండ్ సంస్థ ఖడ్గాన్ని వేలం వేసింది.  ఖ‌డ్గంతో పాటు ఐదు ఆభ‌రణాలు క‌లిగిన తుపాకుల‌ను కూడా ఈ వేలం వేశారు.  

Read: కొత్త కోవిడ్ కిట్‌… 30 నిమిషాల్లోనే…

ధ‌ర‌ను 1.5 మిలియ‌న్ డాల‌ర్లు అనుకున్నా వేలంలో3.5 మిలియ‌న్ డాల‌ర్ల వ‌ర‌కు ప‌లికింద‌ని అన్నారు.  నెపోలియ‌న్ ధ‌రించిన ఖ‌డ్గాన్ని నికోల‌స్ నోయెల్ బౌటెట్ త‌యారు చేసిన‌ట్టు చ‌రిత్ర చెబుతున్న‌ది.  అయితే, ఈ ఖ‌డ్గాన్ని ఈ త‌రువాత రోజుల్లో జ‌న‌ర‌ల్ జీన్ అండోచే జునోట్‌కి అందించార‌ని, ఆ త‌రువాత జ‌న‌ర‌ల్ భార్య అప్పులు తీర్చేందుకు ఆ ఖ‌డ్గాన్ని అమ్మ‌వ‌ల‌సి వ‌చ్చింద‌ని చ‌రిత్ర‌కారులు చెబుతున్నారు.