Site icon NTV Telugu

సీఎం స్టాలిన్ కీల‌క నిర్ణ‌యం: వారికి 48 గంట‌లు వైద్యం ఫ్రీ…

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.  రోడ్డు ప్ర‌మాదాల‌కు గురైన వారిని కాపాడుకునేందుకు కొత్త ప‌థ‌కాన్ని తీసుకొచ్చారు.  ఇన్నుయిర్ కాప్పొమ్ పేరుతో ఈ ప‌థ‌కాన్ని తీసుకొచ్చారు.  ఈ ప‌థ‌కం ప్ర‌కారం, రోడ్డు ప్ర‌మాదం జ‌రిగిన త‌రువాత వెంట‌నే వారిని ఆసుప‌త్రికి తీసుకొచ్చి వైద్యం అందించాల‌ని, రోడ్డు ప్ర‌మాదం బారిన ప‌డిన వ్య‌క్తిని కాపాడేందుకు మొద‌టి 48 గంట‌ల‌కు అయ్యే ఖ‌ర్చును ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని స్టాలిన్ పేర్కొన్నారు.  

Read: ముంబైలో కాంగ్రెస్ స‌భ‌పై నీలిమేఘాలు…

ఈ ప‌థ‌కం ద్వారా రోడ్డు ప్ర‌మాదాల బారిన వారిని ప్రాణాలు కాపాడ‌వ‌చ్చ‌ని అన్నారు.  దీనికోసం రాష్ట్రంలో 201 ప్ర‌భుత్వ‌, 408 ప్రైవేట్ ఆసుప‌త్రుల‌ను ఎంపిక‌చేసిన‌ట్టు తెలిపారు.  త‌మిళనాడుకు చెందిన వ్య‌క్తులే కాకుండా ఎవ‌రైనా స‌రే త‌మిళ‌నాడులో రోడ్డు ప్ర‌మాదానికి గురైతే వారికి కూడా ఈ ప‌థ‌కం వర్తిస్తుంద‌ని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు.  చెంగ‌ల్‌ప‌ట్టు జిల్లాలోని మేల్ మ‌రువత్తూర్‌లోని ఆదిప‌రాశ‌క్తి వైద్య క‌ళాశాల‌లో ఈ ప‌థ‌కాన్ని సీఎం స్టాలిన్‌ ప్రారంభించారు. 

Exit mobile version