NTV Telugu Site icon

Industry Summit: CII సమ్మిట్‌లో ‘నాటు నాటు’ పాట

Natu Natu At Cii

Natu Natu At Cii

ప్రపంచ దేశాలన్నీ ఇండియాపై చూసేలా చేసింది ఆర్ఆర్ఆర్ సినిమా. ఈ చిత్రంలో నాటు నాటు పాటుకు ఆస్కార్ అందుకుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఈ పాటపైనే సర్వత్ర చర్చ. ఆస్కార్ సాధించిన ఆర్ఆర్ఆర్ టీమ్‌కు దేశవ్యాప్తంగా అభినందనులు వెల్లువెత్తుతున్నాయి. ఆ పాట పుట్టిన తెలుగు నేలపై ఆస్కార్ హడావుడి మరింత ఎక్కువగా సందడిగా ఉంది.

Alsor Read:H3N2 Virus: డేంజర్ బెల్స్.. తెలుగు రాష్ట్రాల్లో వ్యాపిస్తున్న వైరస్
‘నాటు నాటు’ ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్‌ను గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా ఈ పాట నటీనటులను అభినందించారు. అంతేకాదు సోమవారం జరిగిన CII (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) భాగస్వామ్య సమ్మిట్ సందర్భంగా పాటను ప్లే చేశారు. ఇండస్ట్రీ సమ్మిట్‌లో ‘నాటు నాటు’ పాటు ప్రదర్శించడం విశేషం. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హాజరైన CII భాగస్వామ్య సదస్సులో RRR చిత్రం యొక్క ‘నాటు నాటు’ పాట క్లిప్ ప్లే చేశారు. అత్యున్నత ఆస్కార్ దక్కడంపై కేంద్ర మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. పెద్ద స్క్రీన్‌పై పాట యొక్క చిన్న క్లిప్‌ను ప్లే చేయమని అభ్యర్థించాడు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీమ్‌ను అభినందించారు.

Also Read:Half day School: రేపటి నుంచే ఒంటిపూట బడులు
కాగా, లాస్‌ ఏంజిల్స్‌ వేదికగా జరిగిన 95వ ఆస్కార్‌ అవార్డ్స్ వేడుకలో నాటు నాటు సాంగ్ హిస్టరీ క్రియేట్ చేసింది. నాలుగు ఇతర సినిమాల పాటలతో పోటీ పడి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ గెలుచుకుంది. అందరూ ఊహించినట్లుగానే RRR మూవీలోని నాటు నాటు సాంగ్ ప్రతిష్టాత్మక ఆస్కార్ గెలుచుకుంది. దీంతో హీరోలు ఎన్‌టీఆర్, రామ్ చరణ్ ఉప్పొంగిపోతున్నారు.బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఉత్తమ పాటగా నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలుచుకుంది. అంతర్జాతీయ వేదికపై రైటర్ చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణి ఈ అవార్డు అందుకున్నారు. దీంతో యావత్ భారతదేశం గర్విస్తోంది.