NTV Telugu Site icon

Muttiah Muralitharan: 800 ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ గా స్టార్ క్రికెటర్..

800 Movie

800 Movie

లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ ‘800’.. ఈ చిత్రానికి ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. అక్టోబర్ 6న థియేటర్లలో సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.. ఈ నెల 25న సోమవారం భాగ్య నగరంలో ‘800’ ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఆ కార్యక్రమానికి హైదరాబాదీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ పతాకంపై వివేక్ రంగాచారి నిర్మించారు. వచ్చే నెలలో ‘800’ విడుదల కానున్న సంగతి తెలిసిందే. అందువల్ల, ప్రమోషన్స్ లో జోరును పెంచారు చిత్ర యూనిట్.. ఇక అక్టోబర్ 6న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ‘800’ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రముఖ నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ తెలిపారు. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ పతాకంపై వివేక్ రంగాచారి ఈ చిత్రాన్ని నిర్మించగా… ఆలిండియా డిస్ట్రిబ్యూషన్ హక్కులను శివలెంక కృష్ణ ప్రసాద్ తీసుకున్నారు.

‘800’లో క్రికెట్ మాత్రమే కాకుండా ముత్తయ్య మురళీధరన్ జీవితంలో జరిగిన అనేక విషయాలు ఉన్నాయని శివలెంక కృష్ణప్రసాద్ తెలిపారు. ఆటతో పాటు అందరినీ ఆకట్టుకునే భావోద్వేగాలు ఉన్నాయని చెప్పారు. తొలుత తన బయోపిక్ తెరకెక్కించడానికి సుముఖత వ్యక్తం చేయలేదని ముత్తయ్య మురళీధరన్ చెన్నైలో జరిగిన కార్యక్రమంలో చెప్పారు. ”శ్రీపతి పట్టు వీడకుండా శ్రీలంక వచ్చి రెండేళ్లు స్క్రిప్ట్ వర్క్ చేశాడు. అతని కమిట్మెంట్, కథను రాసిన తీరు చూసి ఓకే చెప్పా. కరోనా వల్ల సినిమా చిత్రీకరణ ఆలస్యమైంది. ప్రజలంతా సినిమా చూస్తారని ఆశిస్తున్నా అని ఆయన తెలిపారు.. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులకు నచ్చింది. ఆ సినిమా కోసం ఆడియన్స్, క్రికెట్ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. క్రికెట్ మాత్రమే కాకుండా మురళీధరన్ జీవితంలో జరిగిన అంశాలు, భావోద్వేగాల సమ్మేళనంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంటుంది” అని అన్నారు.

మధుర్ మిట్టల్, మహిమా నంబియార్, నరెన్, నాజర్, వేల్ రామమూర్తి, రిత్విక, వడివుక్కరసి, అరుల్ దాస్, హరి కృష్ణన్, శరత్ లోహితశ్వ నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ : ప్రవీణ్ కెఎల్, సినిమాటోగ్రఫీ : ఆర్.డి. రాజశేఖర్, మ్యూజిక్ : జిబ్రాన్, రచన & దర్శకత్వం : ఎంఎస్ శ్రీపతి..