Site icon NTV Telugu

గూగుల్‌లో ఎక్కువ‌మంది సెర్చ్ చేసిన ప‌దాలు ఇవే…

ప్ర‌తి ఏడాది ప్ర‌ముఖ సెర్చ్ ఇంజ‌న్ సంస్థ గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసి అంశాలు ఏంటి?  పాపుల‌రైన పోస్టులు, హ్యాష్ ట్యాగులు త‌దిత‌ర వాటిని రిలీజ్ చేస్తుంటుంది.  2021 వ సంవ‌త్స‌రానికి సంబంధించి లిస్ట్‌ను రిలీజ్ చేసింది గూగుల్ సంస్థ‌.  2021లో క్రికెట్, కోవిడ్ వ్యాక్సినేష‌న్‌, టోక్యో ఒలింపిక్స్, బ్లాక్ ఫంగ‌స్ అంటే ఏంటి?  తాలిబ‌న్ అంటే ఏంటి?  వాట్ ఈజ్ ది ఫ్యాక్టోరియ‌ల్ ఆఫ్ హండ్రెడ్ వింటి ప‌దాల‌ను అధికంగా సెర్చ్ చేశారు.

Read: తెలంగాణ‌లో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్

ఐపీఎల్‌ సీజ‌న్ స‌మ‌యంలో ఎక్కువ‌మంది క్రికెట్ పైనే సెర్చ్ చేస్తుంటారు.  టోక్యో ఒలింపిక్స్ స‌మయంలో ఆ గేమ్స్ గురించిన ప‌దాలు, ట్యాగ్స్ ఎక్కువ‌గా ట్రెండ్, సెర్చ్ అవుతుంటాయి.  అయితే, క‌రోనా మ‌హ‌మ్మారి గ‌త రెండేళ్లుగా ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తుండ‌టంతో క‌రోనా అప్డేట్స్ తెలుసుకునేందుకు క‌రోనా అనే ప‌దాన్ని, వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత కోవిడ్ వ్యాక్సినేష‌న్ అనే ప‌దాన్ని ఎక్కువ‌గా సెర్చ్ చేశారు.  2020లో ఎక్కువ మంది లాక్‌డౌన్ గురించి సెర్చ్ చేయ‌గా, 2021లోనూ లాక్‌డౌన్ ప‌దాన్ని ఎక్కువ‌మంది సెర్చ్ చేసిన‌ట్టు గూగుల్ తెలియ‌జేసింది.  

Exit mobile version