NTV Telugu Site icon

రికార్డ్‌: ఆ బ్యాగ్ ఖ‌రీదు అక్ష‌రాల రూ. 2.75 కోట్లు…

సాధార‌ణంగా ఎంత ఖ‌రీదైన బ్యాగులైనా స‌రే మ‌హా అయితే ల‌క్ష లేదంటే ప‌ది ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌రీదు ఉంటుంది.  కానీ, బ్యాగులందు బిర్‌కిన్ బ్యాగులు వేర‌యా అన్న‌ట్టుగా, సెల‌బ్రిటీల‌కు బిర్‌కిన్ బ్యాగులు మారుపేరుగా మారిపోయింద‌ని చెప్పాలి.  బిర్‌కిన్ బ్యాగుల‌ను సెల‌బ్రిటీలు స్టేట‌స్‌కు సింబ‌ల్‌గా వినియోగిస్తున్నారు.  ఈ బ్యాగుల త‌యారీలో నాణ్య‌మైన జంతువుల చ‌ర్మాల‌ను వినియోగిస్తారు.  అంతేకాదు, ఇందులో సెల‌బ్రీటీల కోసం ప్ర‌త్యేకంగా త‌యారు చేసే బ్యాగుల‌కు బంగారం పూత‌ను మిక్స్ చేస్తారు.

Read: అక్క‌డ రంగంలోకి ఆర్మీ… వారంలో అన్నిరోజులూ వ్యాక్సినేష‌న్‌…

విలువైన వ‌జ్రాల‌ను పొదుగుతారు.  ఇలాంటి బ్యాగులు చాలా ఖ‌రీదైన‌వి.  మాములు బిర్‌కిన్ బ్యాగుల‌తో పోలిస్తే ఈ హిమాల‌య బిర్‌కిన్ బ్యాగులు చాలా ఖ‌రీదైన‌వి.  వీటి ధ‌ర కోట్లల్లో ఉంటుంది.  అమెరికా బెట్టింగ్ రారాజు డేవిడ్ అనే వ్య‌క్తి త‌న భార్య‌కోసం హిమాలయ బిర్‌కిన్ బ్యాగును 2.5 కోట్లు పెట్టి కొనుగోలు చేశాడు.  ఇంత ఖ‌రీదుపెట్టి కొనుగోలు చేసిన ఈ బ్యాగ్‌ను త్వ‌ర‌లోనే వేలం వేయ‌బోతున్నాడ‌ట‌.  ఈ బ్యాగ్‌ను క‌నీసం 14 కోట్ల రూపాయ‌ల‌కు అమ్ముడ‌వుతుంద‌ని చెబుతున్నాడు డేవిడ్‌.