Site icon NTV Telugu

ఒమిక్రాన్ వేరియంట్‌పై మోడెర్నా సీఈఓ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…

ఒమిక్రాన్ వేరియంట్‌పై మోడెర్నా సీఈఓ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్ వేరియంట్‌కు అడ్డుక‌ట్ట వేయ‌లేవ‌ని అన్నారు.  మోడెర్నా సీఈఓ స్టీఫెన్ బాన్సెల్ చేసిన కామెంట్లు ప్ర‌పంచం మొత్తాన్ని కుదిపేశాయి.  స్టీఫెన్ చేసిన ఈ వ్యాఖ్య‌లతో షేర్ మార్కెట్లు దద్ద‌రిల్లిపోయాయి.  అటు క్రూడాయిల్ ధ‌ర‌లు భారీగా క్షీణించాయి.  ప్ర‌పంచంలోని అన్ని వ్యాక్సిన్లు అన్ని దేశాల్లో ఒకే ర‌క‌మైన సామ‌ర్థ్యంతో ప‌నిచేయ‌బోవ‌ని, అందుకే డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందింద‌ని, ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ కూడా అంతేన‌ని అన్నారు.  

Read: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. మళ్లీ వాయిదా పడనున్న సినిమాలు..?

ఒమిక్రాన్ వేరియంట్‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు కొత్త వ్యాక్సిన్ రావాలి అని, దానికోసం కొన్ని నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని, తాను ప్ర‌పంచంలోని అనేక మంది శాస్త్ర‌వేత్త‌ల‌తో తాను మాట్లాడాన‌ని, ప్రస్తుతం ప్ర‌పంచం ప‌రిస్థితి ఏమీ బాగాలేద‌ని తెలిపారు.  వ్యాక్సిన్ లు స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుక‌ట్ట వేయ‌లేక‌పోతే, రోగులు ఎక్కువ రోజులు అనారోగ్యం బారిన ప‌డాల్సి వ‌స్తుంద‌ని, ఆసుప‌త్రుల్లో చేరాల్సి వ‌స్తుంద‌ని ఆయ‌న అన్నారు.  స్టీఫెన్ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌తో వైద్య‌రంగంతో పాటు, మార్కెటింగ్ రంగం కూడా ఒడిదుడుకుల‌కు లోనైంది.  

Exit mobile version