NTV Telugu Site icon

వరి సాగు వద్దు.. రొయ్యల సాగు ముద్దు

వ్యవసాయంలో వరి సాగు వలన లాభం లేదు. ప్రభుత్వం ఎన్ని చేసినా వరి రైతుల కష్టం తీరడం లేదన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు. రొయ్యిల చెరువుల సాగుకు అవకాశం ఉంటే చెయ్యటం మంచిది. శ్రీకాకుళం జిల్లా నుంచి మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. గతంలో మత్స్యకారప్రాంతాలను అభివృద్ది చేయకుండా తప్పుచేసామని నేను ఒప్పుకుంటా.

శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్ మంజూరు చేసారు. తలసరి ఆదాయం పెరగటానికి , మన తలరాత మార్చడానికి ఆక్వారంగంలోని అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ప్రభుత్వం పెద్ద ఎత్తున చేస్తుంది. సంక్షేమం వలన ఇబ్బంది ఉంది‌.మాట ఇచ్చాం కనుక పెద్ద ఎత్తున నిధులు అవసరం. కష్టమైనా సంక్షేమం కొనసాగిస్తున్నాం.సంక్షేమం వలన కరోనా ప్రజల ఆకలి కేకలు వినపడలేదు. ప్రభుత్వం తప్పు ఏమీ చేయటం లేదు. కాలువలు, రోడ్లు అభివృద్దికి వచ్చే రెండేళ్లలో ముందుకు వెళతాం అన్నారు ధర్మాన.