Site icon NTV Telugu

అదృశ్య‌మైన ఎయిర్‌ఫోర్స్ విమానం టైర్‌… చివ‌ర‌కు ఇలా దొరికింది…

ఎయిర్‌ఫోర్స్ విమానం ఒక‌టి ఇటీవ‌లే అదృశ్య‌మైంది.  ఎయిర్ ఫోర్స్ కు చెందిన మిరాజ్ యుద్ద‌విమానానికి చెందిన 5 టైర్ల‌ను యూపీలోని ల‌ఖ్‌న‌పూలోని బ‌క్షిక త‌లాబ్ ఎయిర్‌పోర్స్ నుంచి జోథ్‌పూర్ త‌ర‌లించే క్ర‌మంలో ఈ టైర్ మిస్స‌యింది.  40 అడుగుల పొడ‌వైన భారీ వాహ‌నంలో ఈ విమానం టైర్ల‌ను త‌లిస్తుండ‌గా టైర్ మిస్స‌యింది.  దీనిపై ట్ర‌క్ డ్రైవ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.  అయితే, డిసెంబ‌ర్ 4 వ తేదీన పోలీసు అధికారులు వాయుసేన కు చెందిన మిస్సైన టైర్‌ను తిరిగి రిక‌వ‌రీచేసి అధికారుల‌కు అప్ప‌గించారు.  ఈ టైర్ చోరీ చేస్తున్న‌ట్టుగా అనుమానిస్తున్న ఇద్ద‌రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

Read: విశాఖ‌లో కుంగిన భూమి… ఆందోళ‌న‌లో ప్ర‌జలు…

వివ‌రాల ప్ర‌కారం న‌వంబ‌ర్ 26 వ తేదీన ల‌ఖ్‌న‌పూలోని షహీద్‌పాత్ ప‌రిథిలోని స‌ర్వీస్ రోడ్డులో టైర్‌ను గుర్తించిన ఇద్ద‌రు అనుమానితులు దానిని లారీ టైర్‌గా భావించి ఇంటికి తీసుకెళ్లారు.  అయితే, డిసెంబ‌ర్ 3 వ తేదీన ఎయిర్ ఫోర్స్ విమానం టైర్ మిస్స‌యిన‌ట్టు టీవీలో వార్త‌లు రావ‌డంతో ఆ టైర్‌ను పోలీసుల‌కు అప్ప‌గించారు.  

Exit mobile version