NTV Telugu Site icon

నాసా వ్యూహం: 2024లో చంద్రుని మీద‌… 2030 వ‌ర‌కు మార్స్‌లో…

అమెరికా అంత‌రిక్ష సంస్థ నాసా మార్స్ పై ప‌రిశోధ‌న‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  చాలా కాలం క్రిత‌మే అమెరికా వ్యోమ‌గాములు చంద్రునిమీద అడుగుపెట్టారు.  చంద్రునిపై ప్ర‌యోగాల‌ను అమెరికా వేగ‌వంతం చేసింది.  2024 వ‌ర‌కు చంద్రునిమీద కాల‌నీలు ఏర్పాటు చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. అక్క‌డ కాల‌నీలు ఏర్పాటు చేసి వ్యొమ‌గాముల‌ను అక్క‌డ ఉంచాల‌ని నాసా ఉద్దేశం.  2024లో ఈ లక్ష్యం విజ‌వంతంగా పూర్తిచేస్తే, 2030వ వ‌ర‌కు మార్స్‌పైకి మ‌నుషుల‌ను పంపాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.  దీనికోసం నాసాతో పాటుగా ఎల‌న్ మ‌స్క్ స్పేస్ ఎక్స్ కూడా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ది.  దీనికోసం స్పేస్ ష‌టిల్‌ను త‌యారు చేస్తున్న‌ది స్పేస్ ఎక్స్‌.  అయితే, మార్స్‌లో 96 శాతం కార్బ‌న్‌డై ఆక్సైడ్ ఉండ‌గా, 0.1 శాతం మాత్ర‌మే ఆక్సిజ‌న్ ఉన్న‌ట్టు మార్స్ రోవ‌ర్ గుర్తించింది.  మార్స్ రోవ‌ర్‌లో ఉన్న మాక్సీ అనే సాధ‌నం ద్వారా మార్స్‌లో ఆక్సిజ‌న్‌ను ఉత్ప‌త్తి చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు.  ఎంత వ‌ర‌కు ఆక్సీజ‌న్ ను ఉత్ప‌త్తి చేయ‌వ‌చ్చు… వ్యోమ‌గాములు అక్క‌డ ఉండ‌టానికి ఎంత ఆక్సీజ‌న్ అవ‌స‌రం అవుతంది…నీటిని ఎలా త‌యారు చేయాలి త‌దిత‌ర విష‌యాల‌పై ప్ర‌స్తుతం ప్ర‌యోగాలు జ‌రుగుతున్నాయి. మార్స్ లో కాల‌నీల ఏర్పాటుపై కూడా ప్ర‌యోగాలు చేస్తున్న‌ది నాసా.  

Read: కాబూల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో మ‌రో ఉగ్ర‌దాడి…