ఆర్కే మృతి చెందాడని నిన్నటి నుంచి వార్తలు వస్తున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. నిన్న ఉదయం 6 గంటలకు ఆర్కే మృతి చెందినట్టు పార్టీ ప్రకటించింది. కిడ్నీలు విఫలమై ఆర్కే చనిపోయారని తెలియజేసింది. పార్టీ శ్రేణుల సమక్షంలోనే ఆర్కే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించినట్టు మావోయిస్ట్ పార్టీ తెలియజేసింది. చికిత్స అందించినా ఆర్కేను కాపాడుకోలేకపోయామని పార్టీ తెలియజేసింది. 1958లో ఆర్కే గుంటూరు జిల్లా పల్నాడులో జన్మించారు. 1980లో తొలిసారిగా పీడబ్ల్యూజీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. 1982లో పూర్తిస్థాయి కార్యకర్తగా పనిచేసిన ఆర్కే 1986లో గుంటూరు జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. ఇక 1992లో రాష్ట్రకమిటీ కార్యదర్శిగా పనిచేశారు. దక్షిణ తెలంగాణ ఉద్యమంలో నాలుగేళ్లు పనిచేశారు. 2000లో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన ఆర్కే 2004లో ప్రభుత్వంతో చర్చలు జరిపిన బృందానికి నాయకత్వం వహించారు. చర్చల అనంతరం ఆర్కేను హత్యచేయడానికి ప్రయత్నించారని మావోయిస్టు పార్టీ పేర్కొన్నది.
Read: మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం: చైనాకు లింక్డిన్ షాక్…