NTV Telugu Site icon

న‌యా రికార్డ్‌: 6వేల అడుగుల ఎత్తులో తాడుపై అలా న‌డిచి…

స‌ర్క‌స్‌లో తాడుపై న‌డ‌వ‌డం చూస్తూనే ఉంటాం.  ఎత్తు పెద్ద‌గా లేకుంటే తాడుపై న‌డిచినా ఏం కాదు.  అదే రెండు బిల్డింగ్ మ‌ధ్య తాడును క‌ట్టి న‌డ‌వాలంటే వామ్మో అనేస్తాం.  ఏమాత్రం త‌డ‌బ‌డినా, కాలు జారినా ఇక అంతే సంగ‌తులు.  అదే, గాలిలో రెండు హాట్ బెలూన్ల మ‌ధ్య తాడు క‌ట్టి న‌డ‌వాలి అంటే దానికి గ‌డ్స్ ఉండాల‌ని.  గుండె దైర్యం ఉండాలి.  ప్రాణాల‌పై ఆశ‌లు వ‌దిలేసుకొని సాహ‌సం చేయాలి.  అలా చేసిన‌పుడే చ‌రిత్ర సృష్టించ‌గ‌లుగుతారు.  అసాధ్య‌మైన ఫీట్‌ను చేసి చూపించాడు బ్రెజిల్‌కు చెందిన రాఫెల్ జోగ్నోబిడి.  

Read: చిత్ర పరిశ్రమలో విషాదం.. క్యాన్సర్ తో పోరాడుతూ మృతిచెందిన మ్యూజిక్ డైరెక్టర్

6,131 అడుగుల ఎత్తులో ఎగురుతున్న రెండు హాట్ బెలూన్ల మ‌ధ్య అంగుళం వెడ‌ల్పున్న తాడును క‌ట్టి ఒక హాట్ బెలూన్ మీద నుంచి మ‌రో హాట్ బెలూన్ మీద‌కు న‌డిచాడు.  కాళ్ల‌కు ఎలాంటి షూ వంటివి వేసుకోకుండా రాఫెల్ ఈ సాహ‌సం చేసి ఔరా అనిపించాడు.  ఎవ‌రికీ సాధ్యంకాని ప్ర‌పంచ‌రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. దుబాయ్‌లోని బుర్జ్ ఖ‌లీఫా బిల్డింగ్‌కు డ‌బుల్ ఎత్తులో ఈ సాహ‌సం చేసి రికార్డ్ సాధించిన రాఫెల్ త‌న‌కు చిన్న‌త‌నం నుంచి సాహ‌సాలు చేయ‌డం అంటే ఆస‌క్తి ఉంద‌ని, అందుకే ఇలాంటి సాహ‌సం చేసిన‌ట్టు రాఫెల్ పేర్కొన్నాడు.