కరోనా-లాక్ డౌన్ అల్లు అరవింద్ ఓటీటీ ‘ఆహా’కి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఇందులో చాలా వరకు చిన్న సినిమాలు, సిరీస్‌లే. నిజానికి చాలా వరకూ డబ్బింగ్ సినిమాలే. ఇప్పటి వరకూ ఆహాలో రిలీజైన పెద్ద తెలుగు సినిమా ‘క్రాక్’ మాత్రమే. థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా రిలీజ్ అయిన పెద్ద సినిమాలు నిల్. ఇప్పుడు వరుసగా పేరున్న నటీనటులు, టెక్నీషియన్లతో వెబ్ సిరీస్ తీస్తూ… థియేట్రికల్ రిలీజ్ తర్వాత డిజిటల్ రిలీజ్‌కు కొన్ని పెద్ద సినిమాలను ఆహాలోకి తీసుకు రాబోతున్నారు.
Read Also: ఆకట్టుకుంటున్న సంపూ నగ్నచిత్రం
వాటిలో ముఖ్యమైనది ‘లవ్ స్టోరి’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనాగచైతన్య, సాయిపల్లవి నటించిన ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ లేకుంటే ఏప్రిల్ 16నే విడుదల కావాల్సింది. థియేటర్లు ఆరంభం కాగానే ‘లవ్ స్టోరి’ విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఈ చిత్రాన్ని ఆహాలో స్ట్రీమింగ్ చేస్తారట. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. దీంతో పాటు గీతా ఆర్ట్స్ లో తెరకెక్కుతున్న అఖిల్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, నాగశౌర్య ‘లక్ష్య’ డిజిటల్ హక్కులు కూడా ఆహా సొంతం చేసుకుంది. మరి ఈ సినిమాల స్ట్రీమింగ్ తో ఆహా మరెంతగా పాపులర్ అవుతుందో చూద్దాం.
