Site icon NTV Telugu

ఒలింపిక్స్‌: డిస్కస్‌త్రోలో ఫైనల్‌కు దూసుకెళ్లిన కమల్‌ప్రీత్‌ కౌర్

Kamalpreet Kaur

Kamalpreet Kaur

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయం అయిపోయింది… బంగారు పతకానికి మరో అడుగు దూరానికి చేరుకున్నారు కమల్‌ప్రీత్‌ కౌర్… ఒలింపిక్స్‌ మహిళల డిస్కస్‌త్రో ఈవెంట్‌లో తుదిపోరు కోసం నిర్వహించిన క్వాలిఫికేషన్‌ రౌండ్‌.. రెండోస్థానంలో నిలిచారు కమల్‌ప్రీత్‌ కౌర్‌.. తన అద్భుతమైన ప్రదర్శనతో 64 మీటర్లతో రెండో స్థానం సంపాదించి ఏకంగా ఫైనల్‌కు దూసుకెళ్లారు.. ఇక, డిస్కస్‌త్రో ఫైనల్‌ ఆగస్టు 2వ తేదీన జరగనుంది.. ఈ ఈవెంట్‌లో మొత్తం 12 మంది పోటీపడనున్నారు. కమల్‌ప్రీత్‌ ఫైనల్లోనూ మంచి ప్రదర్శన చేస్తే భారత్‌ ఖాతాలో మరో పతకం పడనుంది.

మరోవైపు.. ఈ పంజాబ్ అథ్లెట్ ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు.. ఎందుకంటే ఆమె ఇటీవల రెండుసార్లు 65 మీటర్ల మార్కును అధిగమించింది.
మార్చిలో జరిగిన ఫెడరేషన్ కప్‌లో ఆమె 65.06 మీటర్లు విసిరి జాతీయ రికార్డును అధిగమించి.. 65 మీటర్ల మార్క్‌ను అధిగమించిన మొదటి భారతీయురాలిగా నిలిచారు.. ఆ తర్వాత జూన్‌లో, ఇండియన్ గ్రాండ్ ప్రి -4 సమయంలో 66.59 మీటర్లు విసిరి ఆమె తన జాతీయ రికార్డును మెరుగుపరుచుకుని ప్రపంచ ఆరవ స్థానంలో నిలిచింది. మొత్తంగా కమల్‌ప్రీత్‌ కౌర్‌ మరో పతకాన్ని భారత్‌కు అందించనున్నారు.

Exit mobile version