Site icon NTV Telugu

గ‌ర్ల్ ఫ్రెండ్ వ‌ద్దు… ఆ బైకులే ముద్దు…  

దేశంలో పెట్రోల్ ధ‌ర‌లు భారీగా పెరుగుతున్నాయి.  దీంతో ప్ర‌జ‌లు ముఖ్యంగా యువ‌త ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అన్వేషిస్తున్నారు.  పెద్ద‌వాళ్లు ప‌బ్లిక్ ట్రాన్స్‌స్పోర్ట్ ల‌ను వినియోగించినా, యువ‌త మాత్రం బైక్‌ల‌వైపే చూస్తున్నారు. పెట్రోల్ బైక్‌ల‌ను ప‌క్క‌న పెట్టి ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వైపు చూస్తున్నారు.  అదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.  ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వ‌ల‌న ఇబ్బందులు ఉన్న‌ప్ప‌టికీ పెట్రోల్ ఖ‌ర్చు క‌లిసోస్తుంది.  కాబ‌ట్టే ఈ వాహ‌నాల‌కు గిరాకీ పెరుగుతున్న‌ది.  ఎల‌క్ట్రిక్ వాహ‌నాల్లో కూడా చాలా వ‌రకు వినూత్నంగా ఉండే బైక్‌ల‌ను త‌యారు చేస్తున్నాయి కంపెనీలు.  

Read: ఎక్కువ‌సేపు ఆ ప‌ని చేస్తే… ఆ ప‌నికి దూర‌మ‌వ్వాల్సిందే…

విజార్డ్ ఇన్నోవేష‌న్ అండ్ మొబిలిటీ లిమిటెట్ కంపెనీ జాయ్ ఈ బైక్ పేరుతో బైక్‌ల‌ను విప‌ణిలో రిలీజ్ చేసింది.  గ‌తేడాది అక్టోబ‌ర్ నెల‌లో జాయ్ ఈ బైక్‌లు 474 యూనిట్లు సేల్స్ అవ్వ‌గా, 2021 అక్టోబ‌ర్ నెల‌లో ఏకంగా 502 ప‌ర్సెంట్ పెరిగింది.  అక్టోబ‌ర్ 2021లో ఏకంగా 2,855 యూనిట్ల జాయ్ ఈ బైక్‌లు అమ్ముడైన‌ట్టు విజార్డ్ ఇన్నోవేష‌న్ సంస్థ తెలియ‌జేసింది.  రాబోయే రోజుల్లో ఈ జాయ్ బైక్ సేల్స్ మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్టు కంపెనీ తెలియ‌జేసింది.  

Exit mobile version