Site icon NTV Telugu

బ్రిటన్ ఎన్నికల ఖర్చు కంటే హుజురాబాద్ ఖర్చే ఎక్కువ

ఎన్నిక ఏదైనా ఓట్లకోసం పార్టీలు ఇచ్చే తాయిలాలు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో గత నెల30న జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికపై జయప్రకాష్ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఎన్నికల ఖర్చు వరల్డ్ రికార్డ్ అన్నారు జేపీ. బ్రిటన్ ఎన్నికల్లో పెట్టిన ఖర్చు కంటే ఒక్క నియోజకవర్గ ఎన్నికకు పెట్టిన ఖర్చు ఎక్కువ అన్నారు. ఎన్నికల సంఘం పాత్ర పోలింగ్ బూత్ లో జరిగే పని వరకే అన్నారు.

ఎన్నికల వ్యవస్థ లో మార్పు రావాలని, బ్రిటన్ ఎన్నికల వ్యవస్థ ను పట్టుకొని వేలాడుతున్నామన్నారు. ప్రజలు కోరుకునేది దీర్ఘకాలిక సంపదను. ఏ రూపం లో ఖర్చు పెడితే సంక్షేమం అనేది ఆలోచించాలి. పది లక్షలు ఇచ్చినా ఓటు వేయలేదు అంటే…దూరదృష్టి తో ప్రజలు ఆలోచిస్తున్నారని అర్థం చేసుకోవాలన్నారు జయప్రకాష్ నారాయణ్. తెలుగు రాష్ట్రాలలో తాయిలాలు పరాకాష్టకు చేరుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు జేపీ.

Exit mobile version