Site icon NTV Telugu

జయలలిత వారసత్వ వివాదం..తెరపైకి మరో మహిళ

తమిళనాడు మాజీ సీఎం జయలలిత వారసత్వ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. జయ లలిత సమాధి దగ్గర ప్రేమ అనే మహిళ నివాళులర్పించింది. తాను జయలలిత కుమార్తెను అని ప్రేమ ప్రకటించుకుంది. దీనికి సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెబుతోంది ప్రేమ. దీంతో ఆమెకు శశికళ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. దీంతో శశికళను ప్రేమ కలవనున్నారు.

తానే జయ వారసురాలినంటూ ప్రేమ ప్రెస్ మీట్ కూడా పెట్టింది. మరో మూడురోజుల్లో శశికళను కలుస్తానన్నారు. ఆమెకు శశికళ అపాయింట్ మెంట్ ఇవ్వడం హాట్ టాపిక్ అవుతోంది. జయలలిత మరణం తర్వాత వారసత్వంపై వివాదం రేగుతూనే వుంది. గతంలో అమృత అనే మహిళ కూడా ఇదే వాదన వినిపించింది. ప్రేమ చెబుతున్నదేంటి? ఆమె దగ్గర వున్న ఆధారాలేంటి?

Exit mobile version