ఆర్ఆర్ఆర్ మూవీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను ట్రిపులార్ మెప్పించింది. చిన్న,పెద్ద అనే తేడా లేకుండా అందరిని అలరించింది. నాటు నాటు పాటతో ఆస్కార్ సైతం సొంతం చేసుకుంది. ఇటీవలే ఆస్కార్‌ను గెలుచుకున్న అనంతరం ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానులను సంపాదించుకుంది. ఇప్పటికీ ప్రపంచంలోని అనేక ప్రాంతాలలోని థియేటర్‌లలో సినిమా నడుస్తోంది. “నాటు నాటు”కు నృత్యం చేసే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read:DC vs MI WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబై ఇండియన్స్ ఢీ.. రేపే ఫైనల్ పోరు..
ఇక, జపాన్‌లో అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ భారీగా ఉన్నారు. జపాన్‌లో రజనీకాంత్ తర్వాత అత్యంత అధికంగా ఫ్యాన్స్ బేస్ ఉన్న హీరో ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. ఆయన సినిమాలు అక్కడ కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి. ఎన్నో రికార్డులు సృష్టించిన ఆర్ఆర్ఆర్.. కథల పుస్తక రూపంలో ఆకట్టుకుంటోంది.
చలనచిత్ర కథాంశాన్ని వివరిస్తూ.. జపనీస్ భాషలో వ్రాశారు. కథతో పాటు చిత్ర పాత్రలు ఉన్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ ల పాత్రలను పెయింటింగ్ చేశారు. మూడు గంటల నిడివి ఉన్న ఈ సినిమాని సబ్‌టైటిల్స్‌తో చూడటం తన బిడ్డకు కష్టమని భావించినందున ఓ తల్లి ఈ పుస్తకాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. RRR సినిమా కోసం మొత్తం ఇలస్ట్రేటెడ్ స్టోరీ బుక్‌ను రూపొందించారు. 3 గంటల సినిమా చూడటం కష్టమని ఆమె భావించింది. జపనీస్ పట్ల తనకున్న గౌరవంతో బుక్ ను ప్రత్యేకంగా డిజైన్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అతి తక్కువ సమయంలో ఏకంగా 70,000 లైక్‌లు వచ్చాయి. జపనీయులు అద్భుతంగా కామెంట్లు చేస్తున్నారు.