కరోనా వైరస్ నుంచి రక్షణకోసం మాస్క్‌ను ధరిస్తున్నాం. మాస్క్‌ను పెట్టుకోవడం ద్వారా కరోనా నుంచి కొంతమేర రక్షణ పొందవచ్చు. అయితే, కరోనా ఉన్నదో లేదో తెలుసుకోవాలంటే ర్యాపిడ్ లేదా ఆర్టీపీసీఆర్ లేదా ర్యాపిడ్ పీసీఆర్ వంటి పరీక్షలు చేయించుకోవాలి. ఆర్టీపీసీఆర్ లేదా ర్యాపిడ్ పీసీఆర్ పరీక్షలు ఖరీదైవి. ర్యాపిడ్ పరీక్షల్లో ఎంత వరకు కరోనా వైరస్‌ను డిటెక్ట్ చేయవచ్చో చెప్పలేం.
Read: సౌతిండియా ‘టాప్’ లేపిన ‘పుష్ప’ ఐటమ్ సాంగ్
అయితే, జపాన్‌కు చెందిన క్యోటో ప్రీఫెక్చువల్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు యసుహిరో త్సుకమోటో ఆయన టీమ్ కలిసి సరికొత్త మాస్క్ ను కనిపెట్టారు. నిప్పుకోడి యాంటీబాడీలను మాస్క్‌పై లేయర్ల రూపంలో పూతగా పూస్తారు. కరోనా వైరస్ మాస్క్‌పై పడినపుడు ఆ ప్రాంతం మెరిసినట్టు కనిపిస్తుంది. ఒక విధంగా ఈ మాస్క్‌లను కరోనా నిర్ధారణ పరీక్షల కోసం కూడా వినియోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
