NTV Telugu Site icon

టీమిండియా చెత్త బ్యాటింగ్.. లీడ్స్‌ టెస్ట్‌లో 80 లోపే ఆలౌట్

లీడ్స్‌ టెస్ట్‌లో టీమిండియా చేతులెత్తేసింది.. మూడో టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభం అయిన తొలిరోజే ఏమాత్రం ప్రతిఘటన చేపకుండా పెవిలియన్‌ను క్యూకట్టారు భారత బ్యాట్స్‌మెన్లు.. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 78 పరుగులకే భారత్‌ ఆలౌట్ అయ్యింది.. ఘోరంగా విఫలం అయ్యారు భారత బ్యాట్స్‌మెన్స్.. పేస్‌ పిచ్‌పై ఏమాత్రం బౌలర్లను ఎదుర్కోలేకపోయారు.. భారత ఇన్సింగ్స్‌లో రోహిత్‌ శర్మ 19, రహానె 18 పరుగులు మినహా ఎవరూ చెప్పుకోదగ్గర స్కోర్‌ చేయలేదు.. విరాట్‌ కోహ్లీ 7 పరుగులు చేస్తే.. రవీంద్ర జడేజా 4, సిరాజ్‌ 3, రిషభ్‌ పంత్‌ 2, బుమ్రా, మహ్మద్ షమీ డకౌట్‌ అయ్యారు. ఇక, ఇండ్లండ్‌ బౌలర్లు నిప్పులు చెరిగాడు.. అండర్సన్, ఓవర్టన్‌ చేరో మూడు వికెట్లు తీయగా.. కరన్‌, బిన్సన్‌ తలా రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.