NTV Telugu Site icon

రాష్ట్రంలో ఏర్పాట‌య్యే కంపెనీల‌కు ప్ర‌తి ఏడాది ఇన్‌సెంటీవ్‌లు…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సీఎం వైఎస్ జ‌గ‌న్ ఐటీ పాల‌సీల‌పై స‌మీక్ష‌ల‌ను నిర్వ‌హించారు.  రాష్ట్రంలో ఏర్పాటయ్యే కంపెనీల‌కు ప్ర‌తి ఏడాది ఇన్‌సెంటీవ్‌ల‌ను ఇవ్వాల‌ని ఈ స‌మీక్ష‌లో నిర్ణ‌యం తీసుకున్నారు.  అయితే, ఒక ఉద్యోగి ఏడాదిపాటు అదే కంపెనీలో ప‌నిచేయాలని స‌మీక్ష‌లో నిర్ణ‌యం తీసుకున్నారు.  ఇక తిరుప‌తి, విశాఖ‌, అనంత‌పురంలో కాన్సెప్ట్ సిటీలు ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.  అదే విధంగా, అవ‌స‌ర‌మైన భూముల‌ను గుర్తించాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు.  

Read: బీస్ట్ మోడ్ లో అక్కినేని హీరో వర్కౌట్లు…!

యువ‌త‌కు ఉద్యోగాలు క‌ల్పించ‌డ‌మే ఐటీ పాల‌సీ ఉద్దేశంఅని జ‌గ‌న్ తెలిపారు.  హెఎండ్ స్కిల్స్ నేర్పించే కంపెనీలు, సంస్థ‌ల‌కు పాల‌సీలో ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు.  భ‌విష్య‌త్తులో ఐటీ రంగానికి విశాఖ కేంద్రంగా మారుతుంద‌ని, ఐటీ రంగంలో అత్యుత్త‌మ యూనివ‌ర్శిటీని విశాఖ‌ల‌కు తీసుకురావాల‌ని, అత్యుత్త‌మ టెక్నాల‌జీ లెర్నింగ్ డెస్టినేష‌న్‌గా యూనివ‌ర్శిటి మారాల‌ని జ‌గ‌న్ స‌మావేశంలో పాల్గోన్న అధికారుల‌కు సూచించారు.