NTV Telugu Site icon

ఈటల దూకుడు : రెండో రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం

హుజురాబాద్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌ కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదట 723 పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించిన అధికారులు టీఆర్‌ఎస్‌కు ఎక్కువగా ఓట్లు వచ్చినట్లు తెలిపారు. అనంతరం ఈవీంఏంలలో ఓట్లను లెక్కింపును ప్రారంభించారు. మొత్తం 22 రౌండ్‌లు నిర్వహించనుండగా.. తొలి రౌండ్‌లో బీజేపీ తన ఆధిక్యాన్ని చాటుకుంది.

తొలిరౌండ్‌లో బీజేపీకి 4,610 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్‌ కు 4,444, కాంగ్రెస్‌ కు 119 ఓట్లు వచ్చాయి. అనంతరం నిర్వహించిన రెండవ రౌండ్‌లో కూడా బీజేపీ తన ఆధిక్యతను ప్రదర్శించింది. రెండవ రౌండ్ లో 192 ఓట్ల ఆధిక్యం సాధించినట్లు తెలుస్తోంది. రెండవ రౌండ్‌లో బీజేపీకి 4851 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్‌ 4659 కు కాంగ్రెస్‌ కు 220 ఓట్లు వచ్చాయి.హుజురాబాద్‌, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలపూర్ మండలాల ఓట్లను లెక్కించనున్నారు. రెండవ రౌండ్ లో వచ్చిన ఓట్లతో ప్రస్తుతం ఈటల రాజేందర్ 358 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.