హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదట 723 పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అధికారులు టీఆర్‌ఎస్‌కు ఎక్కువగా ఓట్లు వచ్చినట్లు తెలిపారు. అనంతరం ఈవీంఏంలలో ఓట్లను లెక్కింపును ప్రారంభించారు. మొత్తం 22 రౌండ్‌లు నిర్వహించనుండగా.. తొలి రౌండ్‌లో బీజేపీ తన 166 ఓట్ల ఆధిక్యాన్ని చాటుకుంది. తొలిరౌండ్‌లో బీజేపీకి 4,610 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్ కు 4,444, కాంగ్రెస్ కు 119 ఓట్లు వచ్చాయి.
అనంతరం నిర్వహించిన రెండవ రౌండ్‌లో కూడా బీజేపీ తన ఆధిక్యతను ప్రదర్శించింది. రెండవ రౌండ్‌లో బీజేపీకి 4851 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్ 4659 కు కాంగ్రెస్ కు 220 ఓట్లు వచ్చాయి. ఆ తరువాత నిర్వహించిన మూడవ రౌండ్‌లో కూడా ఈటల రాజేందర్ తగ్గేదేలే అన్నట్లుగా 911 ఓట్ల ఆధిక్యత సాధించారు. మూడవ రౌండ్ ముగిసే సమయానికి ఈటల 1,269 ఓట్ల ఆధికత్యతో ముందంజలో ఉన్నారు.