భారతీయ సంప్రదాయాల ప్రకారం ఏడడుగులు వేసిన భర్తతో కలిసి కడవరకు జీవించాలి. పురాతన కాలం నుంచి వస్తున్న భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవిస్తుంటారు. అయితే, కట్టుకున్న భార్య తనతో సంతోషంగా ఉండటం లేదని గమనించిన ఓ భర్త సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య ఎవరితో అయితే సంతోషంగా ఉంటుందని భావించాడో వారితోనే కలిసి జీవించే విధంగా చేశాడు. ఆమె ఆనందంకోసం ఆ భర్త రెండో పెళ్లి జరిపించాడు. పెళ్లికాక ముందు ఆమె ఎవర్ని ప్రేమించిందో వారికే ఇచ్చి వివాహం జరిపించాడు. అందరినీ ఒప్పించి వివాహం జరిపించాడు. ఆరు నెలల క్రితం ఉత్తప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన పంకజ్ అనే వ్యక్తికి కోమల్ అనే యువతితో వివాహం జరిగింది. ఆ పెళ్లి ఇష్టం లేకున్నా పెద్దల కోరికమేరకు ఒప్పుకున్నది. పెళ్లై అత్తారింట్లో అడుగుపెట్టిన తరువాత కూడా ఆ మహిళ సంతోషంగా ఉండలేకపోయింది. అయిష్టంగానే తన దగ్గర ఉంటుందని గమనించిన ఆ భర్త, భార్య కోరిక తీర్చేందుకు సిద్ధమయ్యాడు. ప్రేమించిన పింటు అనే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఈ వివాహాన్ని భర్త దగ్గరుండి జరిపించడం విశేషం. ఈ న్యూస్ కాన్పూర్‌లో ట్రెండ్ అవుతున్నది.
Read: అక్టోబర్ 31, ఆదివారం దినఫలాలు