NTV Telugu Site icon

ఆర్ఆర్ఆర్ : ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ వచ్చేసింది…!

Here’s NTR as the INTENSE Komaram Bheem from RRR Movie

మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ కొమరం పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ‘ఆర్ఆర్ఆర్’ నుంచి భీం ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నట్లు ‘ఆర్ఆర్ఆర్’ టీం బుధవారం ప్రకటించారు. చెప్పినట్టుగానే తాజాగా భీం ఫస్ట్ లుక్ తో ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన అభిమానులకు ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ లో ఎన్టీఆర్ రౌద్రంగా కన్పిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కొమరం భీం లుక్ ను విడుదల చేస్తూ ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కు బర్త్ డే శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా గతంలో మేకర్స్ ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేయగా దానికి మంచి స్పందన వచ్చింది. ఇక ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవ్‌గన్, ఒలివియా మోరిస్, సముతిరకని, శ్రియ శరన్ తదితరులు నటిస్తున్నారు. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ ఆగిపోయింది. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ ఏడాది అక్టోబర్ 13 న థియేటర్లలో విడుదల కానుంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.