ఆర్ఆర్ఆర్ : ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ వచ్చేసింది…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ కొమరం పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ‘ఆర్ఆర్ఆర్’ నుంచి భీం ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నట్లు ‘ఆర్ఆర్ఆర్’ టీం బుధవారం ప్రకటించారు. చెప్పినట్టుగానే తాజాగా భీం ఫస్ట్ లుక్ తో ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన అభిమానులకు ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ లో ఎన్టీఆర్ రౌద్రంగా కన్పిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కొమరం భీం లుక్ ను విడుదల చేస్తూ ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కు బర్త్ డే శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా గతంలో మేకర్స్ ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేయగా దానికి మంచి స్పందన వచ్చింది. ఇక ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవ్‌గన్, ఒలివియా మోరిస్, సముతిరకని, శ్రియ శరన్ తదితరులు నటిస్తున్నారు. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ ఆగిపోయింది. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ ఏడాది అక్టోబర్ 13 న థియేటర్లలో విడుదల కానుంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Nithya Menen : నిర్మాణ రంగంపై నిత్యామీనన్ ఫోకస్
-
Raaz Actress: అప్పుడు దెయ్యంగా భయపెట్టిన నటి.. ఇప్పుడు ఫామ్స్టే నడుపుతూ ప్రశాంత జీవితం..
-
India Missile Test: సాహో భారత్.. శత్రు దేశాలకు వార్నింగ్ సిగ్నల్! అడ్వాన్స్డ్ అగ్ని సిరీస్‌లో కీలక టెస్ట్..
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
ట్రెండింగ్
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!