మరికొద్ది రోజుల్లో శీతాకాలం ప్రారంభం కాబోతున్నది. శీతాకాలం ప్రారంభానికి ముందే హిమాలయ సానువుల్లోని గ్రామాల్లో మంచుకురవడం ప్రారంభం అయింది. జమ్ముకాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు గ్రామాల్లో ఇప్పటికే మంచు కురుస్తున్నది. దీంతో పర్యాటకులు ఆయా ప్రాంతాలను సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్ స్పితి జిల్లాలోని ధన్‌కర్ గ్రామంలో విపరీతమైన మంచు కురిసింది. శీతాకాలం ప్రారంభానికి ముందే మంచు కురవడంతో గ్రామం మొత్తం తెల్లని దుప్పటి పరిచినట్టుగా మారిపోయింది. పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఆ గ్రామాన్ని సందర్శిస్తున్నారు. అత్యంత ఎత్తైన కొండపై ఉన్న ఈ గ్రామాన్ని సందర్శించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.
శీతాకాలానికి ముందే ఆ గ్రామాన్ని కమ్మేసిన మంచు…
