కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేసుల ప్రాజెక్ట్ ప్రమాదంలో పడింది. ఎగువున భారీ వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా ప్రాజెక్ట్‌కి నష్టం వాటిల్లేలా వుంది. తుంగభద్ర డ్యాం నుంచి నీరు విడుదల చేస్తే సుంకేసుల భద్రత ప్రశ్నార్థకం కానుంది. ఈ ప్రాజెక్టుని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రాజెక్టు అంటారు. ఇటు తెలంగాణ, అటు ఏపీలోనూ వందలాది గ్రామాలకు తాగునీరు, సాగునీరు అందిస్తోంది. సుంకేసుల ప్రాజెక్ట్‌కి సంబంధించి 16 గేట్లు పనిచేయడం లేదు. సుంకేసుల ప్రాజెక్టు నిర్వహణ అత్యంత దయనీయంగా వుంది. ఈ ప్రాజెక్టుకి తెలంగాణ, ఏపీ రెండువైపులా వుంటాయి. 30 రేడియల్ క్రస్ట్ గేట్లు వుండగా అందులో 16 గేట్లు పనిచేయడం లేదు. ప్రభుత్వం పట్టించుకోకుంటే అన్నమయ్య ప్రాజెక్టు తరహా నష్టం సంభవించే ప్రమాదం వుంది.