NTV Telugu Site icon

వైర‌ల్‌: స్పైడ‌ర్ విమెన్‌… ఉత్త చేతుల‌తోనే…

మాములుగా గోడ ఎక్కాలి అంటే నిచ్చెనో లేదంటే స్టూలో వేసుకొని ఎక్కుతాం.  ఉత్త చేతుల‌తో ఎక్కాలి అంటే సాధ్యం కాదు.  అందులోనే ఎలాంటి పట్టులేన‌టువంటి ప్లెయిన్ గోడ‌ను ఎక్క‌డం సాధ్యంకాని ప‌ని. అయితే ఓ చిన్నారి అసాధ్యాన్ని సాధ్యం చేసి చూసించింది.  ఇంట్లోని గోడ‌ను త‌న ఉత్త చేతుల‌తో ఎక్కింది.  స్పైడ‌ర్ మాదిరిగా చెక‌చెక పైకి పాకింది.  ఆ త‌రువాత అక్క‌డ రెండు చేతుల‌ను గోడ‌కు ఆనించి కాళ్ల‌ను గాల్లోకి ఊపింది.  అనంత‌రం అక్క‌డి నుంచి కింద‌కు దిగింది.  దీనికి సంబందించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.  ఈ చిన్నారి స్పైడ‌ర్ మెన్ డాట‌ర్ అయి ఉంటుంద‌ని, అందుకే అలా పాకేసింద‌ని కామెంట్లు చేస్తున్నారు.  

https://twitter.com/i/status/1437371171578732547

Read: పంజాబ్ కొత్త ముఖ్య‌మంత్రి ఎవ‌రు?