NTV Telugu Site icon

ఆ న‌గ‌రంలో పుట్‌పాత్‌ల‌పై అమ్మ‌కం నిషేదం… ఉల్లంఘిస్తే…

న‌గ‌రాల్లో చిరు వ్యాపారులు ఫుట్‌పాత్‌ల‌పైనే వ్యాపారాలు నిర్వ‌హిస్తుంటారు.  ప్ర‌త్యేక‌మైన వ్యాపార స‌ముదాయాలు ఉండ‌వు కాబ‌ట్టి వీరికి ఫుట్ పాత్‌లే వ్యాపార స‌ముదాయాలుగా మారిపోతుంటాయి.  న‌గ‌ర‌పాల‌క సంస్థ‌లు, అధికారులు, పాల‌కులు వీటి గురించిపెద్ద‌గా ప‌ట్టించుకోరు.  అయితే, గ‌త కొంత కాలంగా ఫుట్‌పాత్ వ్యాపారుల‌పై న‌గ‌ర‌పాల‌క సంస్థ‌లు దృష్టిసారించాయి.  విశాఖ న‌గ‌ర‌పాల‌క సంస్థ దీనిపై ముఖ్యంగా దృష్టి సారించింది.  న‌గ‌రంలోని అనే ఫుట్‌పాత్‌ల‌పై చిరు వ్యాపారులు చేప‌ల‌ను విక్ర‌యిస్తుంటారు.  న‌గ‌రంలో ఏ ఫుట్‌పాత్‌ల‌పై చూసిన చేప‌ల విక్ర‌యాలే క‌నిపిస్తుంటాయి.  దీంతో ఈ వ్యాపారుల‌పై అధికారులు దృష్టి సారించారు.  ఫుట్‌పాత్‌ల‌పై చేప‌ల విక్ర‌యాన్ని నిషేదిస్తున్న‌ట్టు న‌గ‌ర‌పాల‌క సంస్థ తెలియ‌జేసింది.  వెంట‌నే ఆ ఆదేశాలు అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని, ఫుట్ పాత్‌ల‌పై ఎవ‌రైనా అమ్మాకాలు నిర్వ‌హిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చిరించారు.  ఎన్నో ఏళ్లుగా ఫుట్‌పాత్‌ల‌ను న‌మ్ముకొని వ్యాపారం చేసుకుంటున్నామ‌ని, ఇప్పుడు హ‌ఠాత్తుగా నిషేదం విధిస్తే ఎక్క‌డికి వెళ్లి అమ్ముకోవాల‌ని చిరువ్యాపారులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.  త‌మ‌కు మ‌రోక చోట అమ్ముకునే వెసులుబాటు క‌ల్పించాల‌ని అంటున్నారు వ్యాపారులు.  

Read: రాజ‌స్థాన్‌లో అద్భుతం: రెండు త‌ల‌ల‌తో వింత గేదె జ‌న‌నం… పూర్తి ఆరోగ్యంగా…