Site icon NTV Telugu

కొత్త సెంటిమెంట్ ను తెరపైకి తెచ్చిన క్రికెట్ ప్రేక్షకులు…

క్రికెట్ లో కొన్ని సెంటిమెంట్ లు కొనసాగుతూ ఉంటాయి. ఇదే సమయంలో కొన్ని కొత్త సెంటిమెంట్ లు వస్తాయి. తాజాగా నిన్న జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ జట్టు ఓడిపోయిన తర్వాత ఓ కొత్త సెంటిమెంట్ ను అభిమానులు తెరపైకి తెచ్చారు. అయితే ఐసీసీ టోర్నీలో ఫైనల్స్ కు చేరుకున్న రెండు జట్ల కెప్టెన్ లు ట్రోఫీని పట్టుకొని ఫోటో దిగుతారు. అయితే ఆ ఫోటో సమయంలో ట్రోఫీకి ఎడమ వైపు ఏ కెప్టెన్ నిలుచుంటే ఆ జట్టు ఓడిపోతుంది అని అంటున్నారు అభిమానులు. దానికి ఉదాహరణగా 2016 ప్రపంచ కప్ నుండి నిన్న ముగిసిన ప్రపంచ కప్ ఫోటోల వరకు షేర్ చేస్తున్నారు. అయితే 2016 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో ట్రోఫీకి ఎడమ వైపు మోర్గాన్ ఉండటంతో ఆ జట్టు ఓడిపోయిందని.. అలాగే 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో ట్రోఫీకి ఎడమ ఉన్న కోహ్లీ జట్టు… 2019 ప్రపంచ కప్ లో ట్రోఫీకి ఎడమ వైపు ఉన్న కేన్ విలియమ్సన్ జట్టు… 2021 ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ట్రోఫీకి ఎడమ వైపు ఉన్న కోహ్లీ జట్టు.. ఇక తాజాగా 2021 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో మళ్ళీ ట్రోఫీకి ఎడమ వైపు కేన్ విలియమ్సన్ జట్టు ఓడిపోయింది అంటున్నారు అభిమానులు. మరి ఈ సెంటిమెంట్ ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది చూడాలి.

Exit mobile version