NTV Telugu Site icon

ఫ్యాక్ట్స్‌: జ‌నాభా కంటే ఆ దేశాన్ని సంద‌ర్శించేవారే ఎక్కువ‌…

క‌రోనా త‌రువాత ప్ర‌పంచంలో మ‌ళ్లీ టూరిజం రంగం పుంజుకుంటోంది.  వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఎలాంటి నింబంధ‌న‌లు పెట్ట‌కుండా ఆయా దేశాలు ఆహ్వానిస్తున్నాయి. టూరిజం అన‌గానే చాలా మంది యూర‌ప్ దేశాల‌ను సంద‌ర్శించేందుకు ఆస‌క్తి చూపుతుంటారు. ప్ర‌పంచంలో అతి చిన్న‌దేశ‌మైన వాటిక‌న్ సిటిని ప్ర‌తి ఏడాది సుమారు 55 ల‌క్ష‌ల మంది సంద‌ర్శిస్తుంటారు.  ఇక యూర‌ప్ దేశాల‌ను సంద‌ర్శించాలి అనుకునే వారు మొద‌ట‌గా ఫ్రాన్స్ వెళ్తుంటారు.  

Read: “బిగ్ బాస్ 5” సెన్సేషన్ గా సన్నీ… కౌశల్ వైబ్స్

ఫ్యారిస్ న‌గ‌రంలోని ఈఫిల్ ట‌వ‌ర్‌ను చూసేందుకు అక్క‌డికి వెళ్తుంటార‌ట‌.  ప్ర‌తి ఏడాది ఫ్రాన్స్‌ను 8.9 కోట్ల మంది సంద‌ర్శిస్తుంటారు. ఫ్రాన్స్ దేశ జ‌నాభా 6.7 కోట్లే.  దేశ జ‌నాభా కంటే అధిక సంఖ్య‌లో ప్ర‌తి ఏడాది ఆ దేశాన్ని సంద‌ర్శిస్తుంటార‌ట‌.  ఇక‌, యూర‌ప్ వాతావ‌ర‌ణం ఎప్పుడూ చ‌ల్ల‌గా ఉంటుంది.  

Read: ఆ జాతి గిత్త ఖ‌రీదు రూ.కోటి… ఎందుకంటే…

అక్క‌డ వ‌ర్షం అధికంగా కురుస్తుంది అనుకుంటే పొర‌పాటే.  అత్య‌ధిక వ‌ర్ష‌పాతం కురిసే ప్రాంతం భూమ‌ధ్య‌రేఖ‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న కొలంబియాలో ఉంది.  అందుకే కొలంబియా వాతావ‌ర‌ణం మిగ‌తా వాటితో పొలిస్తే వేరుగా ఉంటుంది.  నిత్యం ప‌చ్చ‌గా, అడ‌వుల‌తో నిండిపోయి ఉంటుంది.