Site icon NTV Telugu

హెలికాప్టర్ దుర్ఘటన.. ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే?

సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కూలిన ఘటన దేశవ్యాప్తంగా విషాదం నింపింది. ఈ ప్రమాదం జరిగే సమయంలో అక్కడ వున్న ప్రత్యక్ష సాక్షి అసలేం జరిగిందో వివరించే ప్రయత్నం చేశారు. హెలికాప్టర్ కూలే సమయంలో భారీ శబ్దం వచ్చింది. వెంటనే వెళ్ళి అక్కడ చూస్తే భారీ మంటలతో కూడిన పొగ వచ్చింది. ఈ విషయాన్ని వెంటనే పోలీసులు కు చెప్పామన్నారు ప్రత్యక్ష సాక్షి. హెలికాప్టర్ కూలిన ప్రదేశం నుండి వంద మీటర్ల దూరంలోనే స్థానికులు ఉంటున్నారు.

ఆర్మీ హెలికాప్టర్‌ కూలిన ఘటన అనంతర పరిస్థితులను కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమీక్షిస్తున్నారు. ఆయన నేతృత్వంలో రక్షణశాఖ ఉన్నతాధికారుల సమావేశం అయ్యారు. ఈ ఘటనపై గురువారం పార్లమెంటులో రాజ్ నాథ్ సింగ్ ప్రకటన చేస్తారని తెలుస్తోంది. లికాప్టర్‌ ప్రమాదానికి గురైనట్టు వస్తున్న ఫొటోలు కలవరపెడుతున్నాయి. సోషల్ మీడియాలో ఫోటోలు ఆందోళన కరంగా వున్నాయి.

ఇదిలా వుంటే ఈప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో జనరల్‌ బిపిన్‌ రావత్‌ సహా ఆయన భార్య మధులిక రావత్‌, బ్రిగేడియర్‌ ఎల్‌ఎస్‌ లిద్ధర్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ హర్జిందర్‌ సింగ్‌, నాయక్‌ గురుసేవక్‌ సింగ్‌, నాయక్‌ జితేంద్ర కుమార్‌, లాన్స్‌నాయక్‌ వివేక్‌ కుమార్‌, లాన్స్‌నాయక్‌ బి. సాయితేజ, హవల్దార్‌ సత్పాల్ ఉన్నారు. ప్రమాదం అనంతరం ఎంఐ-17వీఎఫ్‌ హెలికాప్టర్‌ కూనూరు సమీపంలో కూలిపోయినట్లు ఐఏఎఫ్‌ అధికారిక ట్విటర్‌ ఖాతాలో వెల్లడించింది. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపింది.

Exit mobile version