NTV Telugu Site icon

చైనాలో పెను సంక్షోభం… ఆందోళ‌న‌లో రియాల్టీ రంగాలు…

నిర్మాణ రంగంలో ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతిగాంచిన సంస్థ ఎవ‌ర్‌గ్రాండ్‌.  చైనాలో వేలాది ఇళ్ల‌ను నిర్మించింది. వేగంగా నిర్మాణాలు చేప‌ట్ట‌డంతో పాటు, అంతే వేగంగా నిర్మాణాల‌ను పూర్తిచేయ‌డంలోనూ ఎవ‌ర్‌గ్రాండ్ సంస్థ ముందు వ‌ర‌స‌లో ఉంటుంది.  అలాంటి ఎవ‌ర్‌గ్రాండ్ సంస్థ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది.  అంత‌ర్జాతీయ ఇన్వెస్ట‌ర్ల‌కు ఎవ‌ర్ గ్రాండ్ 300 బిలియ‌న్ డాల‌ర్ల‌మేర అప్పులు చెల్లించాల్సి ఉన్న‌ది.  ఈ అప్పులు తీర్చేందుకు ఆస్తులు అమ్మేందుకు ఎవ‌ర్‌గ్రాండ్ సిద్ద‌మైనప్పటికీ కుద‌ర‌లేదు.  

Read: మీడియాపై రాజమౌళి పంచులు.. మీ సంగతి నాకు తెలుసు

ఇక డిసెంబ‌ర్ 6 వ తేదీ నాటికి ఎవ‌ర్ గ్రాండ్ సంస్థ 1.2 బిలియ‌న్ డాల‌ర్ల‌ను చెల్లించాల్సి ఉంది. కానీ వాటిని చెల్లించ‌లేక‌పోవ‌డంతో ప్ర‌ముఖ సంస్థ ఫిట్స్ చైనా రిలాల్టీ దిగ్గ‌జం ఎవ‌ర్‌గ్రాండ్ ను డీఫాల్ట‌ర్‌గా ప్ర‌క‌టించింది.  దీని ప్ర‌భావం ఇత‌ర బ్యాంకింగ్ సంస్థ‌లు, రియాల్టీ రంగాల‌పై ప‌డే అవ‌కాశం ఉంది.  1996లో చైనాలోని షెంజెన్ కేంద్రంగా ఏర్పాటైంది.  2009లో 722 మిలియ‌న్ డాల‌ర్ల ఐపీవో ద్వారా హాంకాంగ్ స్టాక్ ఎక్సేంజ్‌లోకి ప్ర‌వేశించి కొత్త రికార్డ్ సాధించింది.  అప్ప‌టి నుంచి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేప‌డుతూ దూసుకుపోయింది.