ఎలన్ మస్క్ అంటే గుర్తుకు వచ్చేది విద్యుత్ కార్లు. పెట్రోల్, డీజిల్‌కు పోటీగా ఎలన్ మస్క్ కంపెనీ టెస్లా విద్యుత్ కార్లను తయారు చేస్తున్నది. గత కొంతకాలంగా విద్యుత్ కార్లకు డిమాండ్ పెరుగుతుండటంతో మస్క్ ఆదాయం భారీగా పెరిగింది. బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్ ప్రకాచం ఎలన్ మస్క్ ఆదాయం 288.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. హెర్జ్ గ్లోబల్ హోల్డింగ్ అనే సంస్థ ఏకంగా లక్ష టెస్లా కార్లకు ఆర్డర్ ఇచ్చింది. దీంతో టెస్లా షేర్లు భారీగా పెరిగాయి. ఒక్కరోజులోనే మస్క్ ఆదాయం 36.2 బిలియన్ డాలర్లమేర పెరిగింది. అంటే సెకనుకు ఆయన ఆదాయం 3 కోట్లు అన్నమాట. నాస్‌డాక్‌లో షేర్ల విలువ భారీగా పెరగడంతో టెస్లా లక్షకోట్ల డాలర్ల కంపెనీగా అవతరించింది.
ఆయన ఆదాయం సెకనుకు రూ.3 కోట్లు…
