Site icon NTV Telugu

Delhi excise policy case: కవితకు మరోసారి ఈడీ నోటీసులు

mlc kavitha

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో కవిత విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే, ఈ రోజు హాజరుకావడం లేదని ఆమె ఈడీకి సమాచారం అందించారు. మరో రోజు హాజరు అవుతానని తన ప్రతినిధితో ఈడీకి లేఖను పంపింది. ఈ లేఖను పరిశీలించిన ఈడీ అధికారులు ఆమె విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలో కవితకు మరోసారి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 20న విచారణకు హాజరు కావాలని అధికారులు ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా ఈనెల 11న కవితను విచారించిన ఈడీ అధికారులు 16న మళ్లీ విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారు. ఈడీకి కవిత లేఖ రాసిన నేపథ్యంలో మరో తేదీన విచారణకు రావాలని ఈడీ తాజాగా నోటీసులు ఇచ్చింది.

Exit mobile version