బీహార్‌లో ఈనెల 30 వ తేదీన కుషేశ్వర్ ఆస్థాన్, తారాపూర్ స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని పార్టీలు సిద్దం అవుతున్న సమయంలో లోక్ జనశక్తి పార్టీకి ఈసీ షాక్ ఇచ్చింది. ఆ పార్టీ పేరును, గుర్తును ప్రీజ్ చేసింది. పశుపతి పారస్, చిరాగ్ పాశ్వాన్ మధ్య గత కొన్ని రోజులుగా పార్టీ విషయంపై పెద్ద ఎత్తున గొడవ జరుగుతున్నది. దీంతో ఎన్నికల కమీషన్ ఈ నిర్ణయం తీసుకున్నది. ఆ పార్టీ నుంచి పోటీ చేయాలి అనుకునే అభ్యర్థులకు సంబందించి పార్టీల పేర్లను, అందుబాటులో ఉన్న గుర్తులను ఎంచుకొని సోమవారం మధ్యాహ్నం 1 గంట వరకు తెలియజేయాలని పేర్కొంటూ ఈసీ చిరాగ్ పాశ్వాన్, పశుపతి పారస్‌లకు నోటీసులు జారీ చేసింది
Read: బద్వేల్ ఉప ఎన్నికపై పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం
